Mumbai: కప్పు కొట్టడమే ముందున్న లక్ష్యం... లండన్ ఫ్లయిటెక్కిన కోహ్లీ సేన!

- వరల్డ్ కప్ టూర్ కి బయలుదేరిన టీమ్
- ఫోటోలను పంచుకున్న బీసీసీఐ
- శుభాభినందనలు చెబుతున్న క్రికెట్ ఫ్యాన్స్
ఈ నెలాఖరు నుంచి ఇంగ్లండ్ లో ప్రారంభంకానున్న వరల్డ్ కప్ క్రికెట్ కోసం భారత జట్టు బయలుదేరి వెళ్లింది. కోహ్లీ నేతృత్వంలోని ఆటగాళ్ల టీమ్, ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు పయనం కాగా, విమానాశ్రయంలో వీరు దిగిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. గెలుపే లక్ష్యంగా టీమిండియా లండన్ కు బయలుదేరి వెళ్లగా, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Jet set to go #CWC19 #TeamIndia pic.twitter.com/k4V9UC0Zao
— BCCI (@BCCI) May 21, 2019