Andhra Pradesh: కర్నూలులో టీడీపీ నేత శేఖర్ రెడ్డి దారుణహత్య!

  • శేఖరరెడ్డి బైక్ ను అడ్డగించిన నిందితులు
  • కోట్ల సుజాతమ్మ ముఖ్య అనుచరుడే శేఖర్ రెడ్డి
  • తలపై రాయితో మోది కిరాతక హత్య

ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోట్ల సుజాతమ్మ ముఖ్య అనుచరుడు శేఖర్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. డోన్ మండలం, తాపలకొత్తూరులో శేఖర్ రెడ్డి బైక్ ను అడ్డగించిన దుండగులు రాడ్లు, కర్రలతో దాడిచేశారు. అనంతరం బండరాయితో తలపై మోదారు. దీంతో తీవ్రరక్తస్రావం అయిన శేఖర్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అనంతరం దుండగులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. తాపలకొత్తూరు వద్ద శేఖరరెడ్డి  మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు శేఖర్ రెడ్డి భౌతికకాయాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒక్కరోజు ముందు ఈ హత్య చోటుచేసుకోవడంతో కర్నూలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దించారు. మరోవైపు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించేందుకు అధికారులు యోచిస్తున్నారు.

Andhra Pradesh
ke krishna moorthy
murder
sekhar reddy
  • Loading...

More Telugu News