vijay devarakonda: బైక్ రేసింగులో శిక్షణ తీసుకోనున్న విజయ్ దేవరకొండ

  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్'
  • ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ద్విభాషా చిత్రం
  •  కథానాయికగా మాళవిక మోహనన్

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన ఒక వైపున క్రాంతి మాధవ్ సినిమా చేస్తూనే, మరో వైపున ఆనంద్ అన్నామలై దర్శకత్వంలోను చేయనున్నాడు. ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. బైక్ రేసింగ్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు సహజంగా రావడం కోసం విజయ్ దేవరకొండ బైక్ రేసింగులో శిక్షణ పొందనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజనీ కృష్ణన్ దగ్గర కొన్ని రోజులపాటు శిక్షణ తీసుకోనున్నాడు. 'పేట'  సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న మాళవిక మోహనన్ ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. 

vijay devarakonda
malavika
  • Loading...

More Telugu News