ntr: మళ్లీ షూటింగుకి సిద్ధమవుతోన్న ఎన్టీఆర్ - చరణ్

  • కాలు బెణకడంతో షూటింగుకి దూరమైన చరణ్ 
  • ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో షూటింగుకి బ్రేక్
  • అల్యూమినియం ఫ్యాక్టరీ సమీపంలో ప్రత్యేక సెట్     

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందుతోంది. ఈ సినిమా మూడవ షెడ్యూల్ షూటింగు జరుగుతూ ఉండగా, జిమ్ లో చరణ్ కాలు బెణకడం .. ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి గాయం కావడం జరిగింది. దాంతో ఈ సినిమా షూటింగుకి కొన్ని రోజుల పాటు విరామాన్ని ప్రకటించారు.

 తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగును అతిత్వరలో మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్ శివారు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా భట్ తదితరులు ఈ షూటింగులో పాల్గొననున్నట్టు సమాచారం. ఇప్పటికే అనుకోని అవాంతరాల కారణంగా ఆలస్యం కావడంతో, ఇక పెద్ద గ్యాప్ తీసుకోకుండా చకచకా షూటింగు కానిచ్చేయాలనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.     

  • Loading...

More Telugu News