Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లోకి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు.. ఇద్దరిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!

  • కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఘటన
  • నిఘావర్గాల సమాచారంతో ఆపరేషన్
  • భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం

జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో ఈరోజు భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. జిల్లాలోని గోపాల్ పొర ప్రాంతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతాబలగాలకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ ప్రారంభించాయి.

దీంతో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. కాగా, ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నిషేధిత సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Jammu And Kashmir
enconter
two terrorists dead
  • Loading...

More Telugu News