Ashok Babu: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • టీడీపీని చీల్చేందుకు కుట్ర
  • మాధవ్ వ్యాఖ్యలే నిదర్శనం
  • ఏవరేం చేసినా పోరాటం ఆగదు

నారా టీడీపీ, ఎన్టీఆర్ టీడీపీగా తెలుగుదేశం పార్టీ చీలిపోనుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నేతలు టీడీపీని చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారని, అందుకు మాధవ్ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. టీడీపీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నందునే కుట్రలు చేస్తున్నారని, ఎవరేం చేసినా టీడీపీ పోరాటం ఆగదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించడం సరికాదని, ఈసీ బాగా పని చేస్తోందంటూ కితాబివ్వడం బాధాకరమన్నారు.

Ashok Babu
Madhav
Telugudesam
BJP
Pranab Mukherjee
CEC
  • Loading...

More Telugu News