Visakhapatnam District: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పడుతుంది: విశాఖ కలెక్టర్ భాస్కర్

  • పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగింది
  • నాలుగు జిల్లాల నుంచి అరకు లోక్ సభ స్థానం సమాచారం రావాలి
  • ఈ ఫలితం తెలిసేందుకు ఎక్కువ సమయం పడుతుంది

విశాఖపట్టణంలో పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య గతంలో కన్నా రెండున్నర రెట్లు పెరిగిందని జిల్లా కలెక్టర్ భాస్కర్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకముందే ఈవీఎంల లెక్కింపు పూర్తవుతుందని చెప్పారు. అరకు లోక్ సభ నియోజకవర్గం సమాచారం నాలుగు జిల్లాల నుంచి రావాల్సి ఉండటంతో ఇక్కడి ఫలితం వెలువడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. ప్రతి రౌండ్ డేటా సమాచారం విశాఖ ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఆర్వోకు చేరుతుందని వివరించారు.

ఇదిలా ఉండగా, విశాఖలో ఈరోజు సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులో ఉన్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీపీ లడ్డా పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపు సాయంత్రం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అన్నారు.

Visakhapatnam District
aarak
collector
Bhasker
  • Loading...

More Telugu News