New delhi: ఢిల్లీ నుంచి బెంగళూరు బయలుదేరిన చంద్రబాబు

  • కుమారస్వామి, దేవెగౌడను కలవనున్న చంద్రబాబు
  • రేపు ఉదయం కుప్పం చేరుకోనున్న బాబు
  • అమ్మవారికి మొక్కులు చెల్లించనున్న చంద్రబాబు దంపతులు

ఢిల్లీలో ఎన్డీయేతర పక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ఆ తర్వాత తమ కూటమి నేతలతో కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఎన్డీయేతర పక్షాల నేతలు సీఈసీని కలిసిన అనంతరం మళ్లీ ఓమారు సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు బెంగళూరు బయలుదేరారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవెగౌడతో ఆయన భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు.

కుప్పంలోని గంగమ్మ జాతరలో పాల్గొననున్న చంద్రబాబు

రేపు ఉదయం తొమ్మిది గంటలకు బెంగళూరు నుంచి కుప్పంకు చంద్రబాబు వెళ్లనున్నారు. కుప్పంలోని గంగమ్మ జాతరలో పాల్గొంటారు. చంద్రబాబు దంపతులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం, చంద్రబాబు విజయవాడ బయలుదేరి వెళతారని సమాచారం.

New delhi
bangalore
cm
Chandrababu
  • Loading...

More Telugu News