CEC: ప్రజా తీర్పును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే: ప్రణబ్ ముఖర్జీ

  • ఈవీఎంల ట్యాంపరింగ్ వార్తలపై ప్రణబ్ ఆందోళన
  • ఈవీఎంలు, ఎన్నికల ప్రక్రియపై ఈసీకి లేఖ 
  • ఈవీఎంల భద్రత ఎన్నికల సంఘం బాధ్యతే

దేశ వ్యాప్తంగా ఎన్నికలు బాగా నిర్వహించారని కేంద్ర ఎన్నికల కమిషన్ ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న ప్రశంసించిన విషయం తెలిసిందే. సీఈసీని ప్రశంసించిన మర్నాడే ఎన్నికల సంఘానికి సూచనలు చేస్తూ ఆయన ఓ లేఖ రాశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ లేఖలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈవీఎంలు, ఎన్నికల ప్రక్రియపై ఈసీకి ఓ లేఖ రాశారు. ప్రజా తీర్పును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. ఈవీఎంల భద్రత ఎన్నికల సంఘం బాధ్యత అని, ప్రజాస్వామ్య మూలసూత్రాలను సవాలు చేసే ఊహాగానాలకు చోటివ్వొద్దని సూచించారు. ఎన్నికల కమిషన్ యొక్క నిబద్ధతపై ప్రజలకు అనుమానాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సీఈసీపై ఉందని సూచించారు.

CEC
Ex-president
Pranab Mukherjee
EVM`s
  • Loading...

More Telugu News