Engeneering: యూపీలో తరగతి గదిలో విద్యార్థులపై దాడి.. 13 మందికి గాయాలు

  • పాత గొడవల కారణంగా దాడి
  • క్లాస్ జరుగుతుండగానే ప్రవేశించిన విద్యార్థులు
  • కర్రలతో కొట్టడంతో తీవ్ర గాయాలు

పాత కలహాల నేపథ్యంలో ఓ గ్రూప్‌ క్లాస్‌ రూమ్‌లోకి వెళ్లి మరీ మరో గ్రూప్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు అమ్మాయిలు సహా 13 మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్‌లో భగవంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల ఈ గొడవలకు వేదికైంది. ఈ గొడవలపై కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవ్ మెహ్రా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం, కొందరు విద్యార్థులు ఓ పాత గొడవ కారణంగా క్లాస్ జరుగుతుండగానే ఓ క్లాస్ రూమ్‌లోకి ప్రవేశించి విద్యార్థులపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు మిరాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో పంకజ్ త్యాగి తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 26 మందిపై కేసు నమోదు చేశామని, ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News