akhilesh yadav: అఖిలేశ్ యాదవ్ కు ఫోన్ చేసిన కేజ్రీవాల్

  • ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
  • ఎగ్జిట్ పోల్స్ నమ్మదగినవి కావన్న సంజయ్ సింగ్
  • ఎస్పీ-బీఎస్పీ కూటమికి 60కి పైగా సీట్లు వస్తాయంటూ ధీమా

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ చేశారు. 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. వారి చర్చల వివరాలను సమాజ్ వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాకు క్లుప్తంగా వివరించారు. బీజేపీని అధికారంలోకి రాకుండా ఎలా అడ్డుకోవాలో ఇరువురు నేతలు చర్చించారని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో చర్చించడం జరిగిందని చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్ నమ్మదగినవి కాదని... ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి 60కి పైగా స్థానాలు వస్తాయని సంజయ్ సింగ్ తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోనుందని చెప్పారు.

akhilesh yadav
kejriwal
sp
aap
phone
  • Loading...

More Telugu News