Andhra Pradesh: లగడపాటి సర్వేపై అయ్యన్నపాత్రుడు విమర్శలు!

  • ప్రజల నాడి తెలిసిన వాడు ఎగ్జిట్ పోల్ చేయాలి
  • తెలంగాణలో లగడపాటి ఎగ్జిట్ పోల్ నమ్మి నష్టపోయారు
  • పందేలు కాసిన వాళ్లు కోట్లలో లాస్ అయ్యారు  

ఏపీ ప్రజలు టీడీపీకి మళ్లీ పట్టం కడతారన్న లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.

 ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల నాడి తెలిసిన వాడు ఎగ్జిట్ పోల్ చేయాలి తప్ప, అది తెలియని వాడు సర్వే చేస్తే ప్రయోజనం ఏముంటుందని అన్నారు. అలాంటి వాళ్లందరూ ఎగ్జిట్ పోల్ చేయడం వల్ల ప్రమాదం ఏంటంటే .. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కారణంగా పందేలు కాసిన వాళ్లు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని విమర్శించారు. లగడపాటి మాట నమ్మేసి సర్వనాశనం అయిపోయామని ఇటీవలే హైదరాబాద్ లో పెళ్లికి వెళితే అక్కడికి వచ్చిన వాళ్లలో కొంతమంది తనకు చెప్పారని అన్నారు.

Andhra Pradesh
Telugudesam
Ayyanna Patrudu
lagadapati
  • Loading...

More Telugu News