ramya behara: టాబ్లెట్స్ వేసుకోవడమంటే నాకు చచ్చేంత భయం: సింగర్ రమ్య బెహరా

  • ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చింది 
  • అమ్మానాన్నలు కంగారు పడుతున్నారు
  •  బెడ్ షీట్ కింద నేను దాచిన టాబ్లెట్స్ బయటపడ్డాయి

తెలుగులోని యంగ్ సింగర్స్ లో రమ్య బెహరా బాగా పాప్యులర్ అయింది. ఆమె ఖాతాలో చాలా హిట్ సాంగ్స్ కనిపిస్తాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన చిన్నప్పుడు జరిగిన ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించింది.

" చిన్నప్పుడు నాకు టాబ్లెట్స్ వేసుకోవడమంటే భయం. టాబ్లెట్ గొంతులో అడ్డం పడుతుందేమోనని భయపడుతూ ఉండేదానిని. అందువలన టాబ్లెట్స్ వేసుకునేదానిని కాదు. ఒకసారి నాకు జ్వరం వచ్చింది .. అమ్మ ఇచ్చిన టాబ్లెట్స్ ను వేసుకోకుండా దాచేస్తున్నాను. దాంతో నాకు జ్వరం తగ్గడం లేదు .. అమ్మానాన్నలకు టెన్షన్ పెరిగిపోతోంది. ఒకరోజున మా అమ్మ నా బెడ్ షీట్ దులిపితే .. దాని కింద అన్నీ నేను దాచేసిన టాబ్లెట్సే. దాంతో మా అమ్మ నాకు చీవాట్లు పెట్టేసింది. అప్పటి నుంచి టాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు చేసుకున్నాను" అంటూ నవ్వేసింది. 

ramya behara
kalpana
  • Loading...

More Telugu News