Jagan: జగన్ నాకు మేనల్లుడి వంటివాడు... యూపీఏలో కలపాలని హైకమాండ్ చెప్పలేదు: కేవీపీ కీలక వ్యాఖ్యలు

  • మా సంబంధం వ్యక్తిగతం మాత్రమే
  • రాజకీయాలకు సంబంధం లేదు
  • కాంగ్రెస్ హైకమాండ్ చెబితే జగన్ తో చర్చిస్తానన్న కేవీపీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో తనకున్న సంబంధం, మామ, అల్లుళ్ల మధ్య ఉన్న సంబంధమని, అది వ్యక్తిగతమని, రాజకీయాలకు, తమ అనుబంధానికి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, జగన్ తనకు మేనల్లుడి వంటివాడని, జగన్ పుట్టకముందు నుంచే తాను వైఎస్ తో కలిసున్నానని అన్నారు. జగన్ తో తన అనుబంధం తెగిపోయేది కాదని స్పష్టం చేశారు. జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని అన్నారు. యూపీఏలో జగన్ ను కలపాలని తనను అధిష్ఠానం కోరలేదని, ఒకవేళ ఆ బాధ్యతలను తనకు అప్పగిస్తే, నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని కేవీపీ స్పష్టం చేశారు. యూపీఏగానీ, కాంగ్రెస్ గానీ, జగన్ కు సీట్లు పెరిగితే తమతో కలుపుకోవాలని చూస్తున్నాయన్న సంగతి తనకు తెలియదని అన్నారు. తాను ప్రస్తుతం జగన్ తో ఎందుకు లేనన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పలేనని, దాని గురించి చర్చించే సమయం ఇది కాదని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News