Tamilnadu: చదవడం లేదని ఐదేళ్ల బిడ్డను కొట్టి చంపిన తల్లి!

  • తమిళనాడు నమక్కల్ జిల్లాలో ఘటన
  • కుమార్తె లతికశ్రీని దారుణంగా కొట్టిన తల్లి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిడ్డ మృతి

ఆమె ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయిని. తన ఐదేళ్ల బిడ్డ చదువుకోమంటే చదవకుండా, టీవీ చూస్తోందన్న ఆగ్రహంతో విచక్షణా రహితంగా కొట్టి, బిడ్డ మరణానికి కారణమైంది. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లా కాట్ పుత్తూర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నిత్యకమల అనే టీచర్ కు లతికశ్రీ అనే ఐదేళ్ల బిడ్డ ఉంది. బిడ్డ చదవడం లేదన్న ఆగ్రహంతో తల్లి దారుణంగా కొట్టగా, దెబ్బలకు తాళలేకపోయిన పాప స్పృహ కోల్పోయింది. లతికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిత్యకమలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Tamilnadu
Mother
Child
Police
  • Loading...

More Telugu News