TV9 Raviprakash: 12 రోజుల్లో 30 సిమ్ కార్డులు మార్చిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్!

  • మే 9న టీవీ9లో సోదాలు
  • అప్పటి నుంచి రోజుకు రెండు మూడు సిమ్ ల మార్పు
  • వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ మాత్రమే చేస్తున్న రవిప్రకాశ్!

తెలుగు న్యూస్ చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు 30 సిమ్ కార్డులను మార్చినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. టీవీ9 కార్యాలయంలో సోదాలు జరిగిన ఈ నెల 9వ తేదీ నుంచి ఇంతవరకూ ఆయన రోజుకు రెండు నుంచి మూడు సిమ్ లను మారుస్తూ వచ్చారని, పోలీసులు అంటున్నారు.

సాంకేతికంగా తన జాడను బయట పెట్టకుండా ఉండేందుకు వైఫై ద్వారా వాట్స్ యాప్ కాల్స్ లో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారని కూడా గుర్తించినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. డేటా చోరీ, ఫోర్జరీ వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న రవిప్రకాశ్, పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ సైతం ఇంతవరకూ పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో, వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా, తనపై దాఖలైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని, అయితే, తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. టీవీ9 వాటాల వివాదం ప్రస్తుతం విచారణలో ఉందని, అది పూర్తి కాకుండా, పోలీసులు కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నది రవిప్రకాశ్ వాదన.

TV9 Raviprakash
Sim cards
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News