kalpana: బాలనటిగా పాతిక సినిమాల వరకూ చేశాను: గాయని కల్పన

  • చిన్నప్పటి నుంచి డాన్స్ .. పాటలు ఇష్టం 
  • మా అమ్మమ్మ డాన్స్ నేర్పించింది
  •  బాలనటిగా మలయాళంలో తొలి సినిమా చేశాను   

బుల్లితెర ప్రేక్షకులకు గాయని కల్పన గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. వివిధ భాషల్లో ఆమె అలవోకగా .. అద్భుతంగా పాడగలరు. అలాంటి కల్పన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తనకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

 "చిన్నప్పటి నుంచే నేను డాన్స్ పట్ల .. పాటల పట్ల ఆసక్తిని చూపుతూ ఉండేదానిని. నాలోని ఈ ఆసక్తిని మా అమ్మమ్మ గుర్తించి నాకు డాన్స్ నేర్పించింది. ఆ సమయంలోనే మలయాళ దర్శకుడు ఐవీ శశిగారు ఒక సినిమా చేస్తూ, మూడు నాలుగు సంవత్సరాల లోపు గల ఒక పాప కోసం చూస్తున్నారు. ఈ విషయం తెలిసి మా అమ్మమ్మ నన్ను అక్కడికి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ 28 మంది చిన్న పిల్లలు ఉన్నారట. వాళ్లందరిలో ఆ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకున్నారట. అలా బాలనటిగా ఆ సినిమాతో పరిచయమయ్యాను. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో 25 సినిమాల వరకూ చేశాను" అని చెప్పుకొచ్చారు. 

kalpana
ali
  • Loading...

More Telugu News