Anantapur District: అనంతపురంలో విషాదం.. ప్రియురాలితో కలిసి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్!

  • ప్రేమను అంగీకరించని యువకుడి కుటుంబ సభ్యులు
  • మరో యువతితో నిశ్చితార్థం.. వచ్చే నెలలో పెళ్లి
  • మనస్తాపంతో ఆత్మహత్య

అనంతపురంలో విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి.రమేశ్ బాబు (30) పట్టణానికే చెందిన ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలిసిన రమేశ్ కుటుంబ సభ్యులు మరో యువతితో అతడికి నిశ్చితార్థం చేశారు. జూన్ మొదటి వారంలో వివాహం జరగాల్సి ఉంది.

కుటుంబ సభ్యుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన రమేశ్‌బాబు ప్రియురాలితో కలిసి సోమవారం అర్ధరాత్రి కడప శివారులోని గంగాయపల్లె చేరుకున్నాడు. అనంతరం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Anantapur District
Kadapa District
Andhra Pradesh
Lovers
Suicide
  • Loading...

More Telugu News