Jagan: జగన్‌కు ఫోన్ చేసిన శరద్ పవార్.. తమతో కలిసి రావాలని పిలుపు

  • బీజేపీదే అధికారమన్న ఎగ్జిట్ పోల్స్
  • ఎన్డీయేతర కూటమికి మద్దతివ్వాలంటూ జగన్‌కు ఫోన్లు
  • ఫలితాలు వచ్చాక మాట్లాడుకుందామన్న జగన్

వివిధ జాతీయ చానళ్లు ఆదివారం వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ స్థానాలను కూడా గణనీయంగా గెలుచుకుంటుందని తేల్చాయి. మరోవైపు కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్‌ను విశ్వసించని కాంగ్రెస్ నేతలు హంగ్ తప్పదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలను తమతో కలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఇందులో భాగంగా ఆదివారం జగన్‌కు ఫోన్ చేసిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీయేతర కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అలాగే, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ సోమవారం జగన్‌కు ఫోన్ చేసి సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని జగన్ బదులిచ్చినట్టు తెలుస్తోంది.

Jagan
Sarad pawar
Congress
NDA
Exit polls
  • Loading...

More Telugu News