Inter: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మరోమారు వాయిదా
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-4e2eca0bdf379f464a6d19f8c0f9ffce47daf461.jpg)
- ఈ నెల 25 నుంచి జరుగుతాయన్న బోర్డు
- వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటన
- జూన్ 7 నుంచి 14 వరకూ నిర్వహణ
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ నెల 25 నుంచి సప్లిమెంటరీ పరీక్షలుంటాయని ప్రకటించిన బోర్డు నేడు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరీక్షలను జూన్ 7 నుంచి 14 వరకూ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. అదే విధంగా జూన్ 15 నుంచి 18 వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయని బోర్డు ప్రకటించింది.