akhilesh yadav: ఇప్పుడేమీ మాట్లాడను.. తర్వాత మాట్లాడాల్సి వస్తే మాట్లాడతా: అఖిలేశ్ యాదవ్

  • యూపీలో బీజేపీ కూటమిదే హవా అన్న ఎగ్జిట్ పోల్స్
  • మాయావతితో భేటీ అయిన అఖిలేశ్
  • మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడని ఎస్పీ అధినేత

లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ అయ్యారు. మాయావతి నివాసమైన మాల్ అవెన్యూలో వీరు సమావేశమయ్యారు. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశానంతరం మీడియాతో మాట్లాడేందుకు అఖిలేశ్ ఇష్టపడలేదు. ఇప్పుడు తాను ఏమీ మాట్లాడలేనని, మాట్లాడాల్సిన అవసరం వస్తే తరువాత మాట్లాడతానని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత మాయావతి, అఖిలేశ్ ఇద్దరూ మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. యూపీలో బీజేపీ కూటమికే మెజార్టీ సీట్లు వస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన సంగతి తెలిసిందే.

akhilesh yadav
mayavati
sp
bsp
  • Loading...

More Telugu News