lawrence: తెలుగులో భారీ లాభాలను తెచ్చిపెట్టిన 'కాంచన 3'
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-5c936f6a3e33f73a7e38abff1e0f19708c2a7d76.jpg)
- హారర్ థ్రిల్లర్ చిత్రాల దర్శకుడిగా లారెన్స్
- తెలుగు .. తమిళ భాషల్లో ఆయన సినిమాలకి క్రేజ్
- బి - సి సెంటర్స్ లో భారీ వసూళ్లు
నృత్యదర్శకుడిగానే కాదు, నటుడిగా .. దర్శకుడిగా కూడా లారెన్స్ తానేమిటన్నది నిరూపించుకున్నాడు. హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలోను .. ఉత్కంఠభరితంగా ఆ కథలను నడిపించడంలోను లారెన్స్ సిద్ధహస్తుడు. అందువలన ఆయన నుంచి వరుసగా వస్తున్న హారర్ థ్రిల్లర్ సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ విజయాలను దోసిట్లో పెడుతున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-15ca3cb0b32d59ef231346cb32de34ed90099e1b.jpg)