cine: సినీనటుడు రాళ్లపల్లి అంత్యక్రియలు పూర్తి

  • మోతీనగర్ లోని రాళ్లపల్లి నివాసానికి సినీ ప్రముఖులు
  • తుది వీడ్కోలు పలికిన అభిమానులు
  • మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు

సినీనటుడు రాళ్లపల్లి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు. అంతకుముందు, మోతీనగర్ లోని రాళ్లపల్లి నివాసానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తరలి వెళ్లారు. రాళ్లపల్లి మృతదేహానికి నివాళులర్పించారు. రాళ్లపల్లితో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు.  

కాగా, శ్వాసకోశవ్యాధితో రాళ్లపల్లి గత శుక్రవారం మృతి చెందారు. అమెరికాలో ఉన్న రాళ్లపల్లి కూతురు, అల్లుడు వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. అమెరికా నుంచి వాళ్లు రావడంతో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించారు. 

cine
artish
Rallapalli
Filmnagar
maha prastnam
  • Loading...

More Telugu News