Tollywood: ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు.. ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత కొడాలి నాని!

  • ప్రియమైన సోదరుడు తారక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
  • అని ట్వీట్ చేసిన కొడాలి నాని
  • శుభాకాంక్షలు చెప్పిన రాజమౌళి, రామ్ చరణ్, భూమిక

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు. ‘నా ప్రియమైన సోదరుడు తారక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని కొడాలి నాని ట్వీట్ చేశారు. మరోవైపు తారక్ ను తమకు ఇచ్చినందుకు తాను ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని సంగీత దర్శకుడు తమన్ వ్యాఖ్యానించారు. వీరితో పాటు హీరో రామ్ చరణ్, నటి భూమిక, ఇషా రెబ్బా, దర్శకుడు రాజమౌళి, టీడీపీ నేత సీఎం రమేశ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tollywood
ntr
Twitter
birthday wishes
Kodali Nani
YSRCP
tarak
  • Loading...

More Telugu News