Andhra Pradesh: ‘చంద్రగిరి’ ఎన్నికల్లో అక్రమాలు.. అధికారులపై కొరడా ఝుళిపించిన ఎన్నికల సంఘం!

  • ఐదు పోలింగ్ కేంద్రాల పీవో, ఏపీవోల సస్పెన్షన్ 
  • వీరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశం
  • అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ పెట్టాలన్న ఈసీ

చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, పులివర్తిపల్లెలో గత నెల 11న ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆఫీసర్లు(పీవో), ఏపీవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

అలాగే ఏప్రిల్ 11న ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. చంద్రగిరిలోని ఈ ఐదు గ్రామాల్లో ఎన్నికల  సందర్భంగా అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం నిన్న ఈ ఐదు గ్రామాలతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులోనూ రీపోలింగ్ నిర్వహించింది. ఈసీ విచారణలో ఇక్కడ పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరిగినట్లు తేలడంతో చర్యలు తీసుకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News