Chandrababu: ఎగ్జిట్ పోల్స్ తర్వాత చంద్రబాబు, మమత పొలిటికల్ ఐసీయూలో ఉన్నారు: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

  • ఎగ్జిట్ పోల్స్ తో విపక్ష నేతలు షాక్ కు గురయ్యారు
  • 23 తర్వాత వీరంతా పశ్చాత్తాప పడాలి
  • అప్పుడు వీరికి రాజకీయ మోక్షం లభిస్తుంది

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీలను ఉద్దేశించి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత చంద్రబాబు, మమతలతో పాటు విపక్ష నేతలంతా షాక్ కు గురయ్యారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వీరంతా పొలిటికల్ ఐసీయూలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్డీయేకు భారీ మెజార్టీ రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ స్పష్టం చేశాయని తెలిపారు. మే 23 తర్వాత ప్రజలందరి ముందు వీరంతా పశ్చాత్తాప పడాలని, అప్పుడు వీరికి రాజకీయ మోక్షం లభిస్తుందని చెప్పారు.

Chandrababu
mamata banerjee
giriraj singh
exit polls
  • Loading...

More Telugu News