Chandrababu: ఢిల్లీలో మళ్లీ రేపు ధర్నాకు చంద్రబాబు నిర్ణయం...ఈవీఎంల పనితీరుపై మరోసారి నిరసన

  • వీవీ ప్యాట్లు లెక్కించాలంటూ డిమాండ్‌
  • మైండ్‌గేమ్స్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అరోపణ
  • ఎన్నికల సంఘం తీరుపై ధ్వజం

దేశరాజధాని ఢిల్లీలో మరోసారి ధర్నాకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరు, ఈవీఎంల పనితీరు, వీవీ ప్యాట్ల లెక్కింపు వంటి అంశాలపై నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదాస్పదం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.

Chandrababu
New Delhi
dharna
  • Loading...

More Telugu News