Andhra Pradesh: తిరుమలలో మీడియాతో మాట్లాడిన లగడపాటి రాజగోపాల్!

  • అలిపిరి నుంచి కాలినడకన చేరుకున్న నేత
  • స్వామివారికి ప్రత్యేక పూజలు
  • నిన్న సర్వే విడుదల చేసిన లగడపాటి

లోక్ సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ.. నిన్న రాత్రి అలిపిరి మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలకు మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 100 (అటూ ఇటూగా 10 స్థానాలు) రావొచ్చని లగడపాటి రాజగోపాల్ చెప్పిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రాకపోయినా గట్టి పోటీ ఇచ్చిందనీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 72 (అటూ ఇటూగా 7 స్థానాలు), ఇతరులు 3 (అటూ ఇటూగా 2 స్థానాలు) వస్తాయని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీదే పై చేయిగా ఉంటుందని అన్నారు. టీడీపీకి 15 (అటూ ఇటూగా 2 స్థానాలు)  వైసీపీకి 10 (అటూ ఇటూగా 2 స్థానాలు) ఇతరులు ఓ స్థానం సాధించే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh
Tirumala
LAGADAPATI
MEDIA
AP
SURVEY
  • Loading...

More Telugu News