Andhra Pradesh: చంద్రబాబు కారణంగానే మేమంతా తలెత్తుకుని ప్రజల వద్దకు వెళ్లగలిగాం!: మంత్రి అఖిలప్రియ

  • బాబు మరోసారి సీఎం కావడం ఖాయం
  • టీడీపీ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి  చేసింది
  • కడపలో పెద్దదర్గాను దర్శించుకున్న టీడీపీ నేత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని మంత్రి భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పారు.. కడప జిల్లాలోని పెద్దదర్గాను మంత్రి అఖిలప్రియ ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

చంద్రబాబు కారణంగానే తామంతా తలెత్తుకుని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగగలిగామని అఖిలప్రియ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి చేపట్టిందనీ, మహిళలను ఆదుకుందని మంత్రి గుర్తుచేశారు. అందువల్లే దైర్యంగా ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు కోరామని పునరుద్ఘాటించారు. మే 23 తర్వాత ఏపీలో భారీ మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని అఖిలప్రియ జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
akhilapriya
Kadapa District
  • Loading...

More Telugu News