modi: మళ్లీ మోదీకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్.. జెట్ వేగంతో దూసుకుపోతున్న సెన్సెక్స్

  • మరోసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడబోతోందనే అంచనాలు
  • దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫుల్ జోష్
  • 920 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్

ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాబోతోందని, మోదీ మళ్లీ ప్రధాని అవుతారంటూ నిన్న దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ ఆకాశాన్నంటింది. సెన్సెక్స్ ఏకంగా 950 పాయింట్లకు పైగా ఎకబాకింది. 2014 మాదిరే ఈసారి కూడా కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి.

ఉదయం 10.25 గంటల సమయంలో సెన్సెక్స్ 920 పాయింట్ల లాభంతో 38,851 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 272 పాయింట్లు ఎగబాకి 11,679 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.

modi
nda
exit polls
sensex
niftry
stock market
  • Loading...

More Telugu News