mamata banerjee: ఎగ్జిట్ పోల్స్‌తో భారీ కుట్ర.. మమత బెనర్జీ ఫైర్

  • ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మాల్సిన పనిలేదు
  • ఈవీఎంలను తారుమారు చేయబోతున్నారు
  • విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలి

ఎగ్జిట్ పోల్స్ పేరుతో భారీ కుట్రకు తెరలేపారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాను విశ్వసించబోనన్నారు. ఎగ్జిట్ పోల్స్ మాటున భారీ కుట్ర జరగబోతోందని ఆరోపించారు. ఈ వార్తలకు బాగా ప్రచారం కల్పించి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తారని, ఆ తర్వాత వేలాది ఈవీఎంలను ఒక చోటి నుంచి మరో చోటుకి తరలించే కుట్ర జరగబోతోందని ఆరోపించారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలని, మతతత్వ శక్తులను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని మమత పిలుపునిచ్చారు.  

కాగా, నిన్న సాయంత్రం తుది విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే వివిధ చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. దాదాపు అన్నీ ఎన్డీయే మరోమారు అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పాయి. ఎన్డీయేకు 300కు పైగా స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి. ఈ అంచనాలపై స్పందించిన మమత వాటిని నమ్మొద్దని ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో కుట్రకు తెరలేపారని ఆరోపించారు.

mamata banerjee
West Bengal
BJP
Exit polls
  • Loading...

More Telugu News