Lagadapati: లగడపాటి పక్కన నూతన్ నాయుడు.. సర్వే చేసింది 'కామన్ మ్యానే'నా?

  • లగడపాటి పక్కన నూతన్ నాయుడు ఉండడంపై సందేహాలు
  • ఆర్జీ ఫ్లాష్ టీంతో అతడికి సంబంధాలు ఉండే అవకాశం ఉందని వాదన
  • రాజకీయాల్లో చర్చనీయాంశం

నిన్న సాయంత్రం తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసీ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చి పడ్డాయి. జాతీయ చానళ్లు అన్నీ ఎగ్జిట్ పోల్స్‌తో ఒక్కసారిగా ఒక్కిరిబిక్కిరి చేశాయి. దాదాపు చానళ్లు అన్నీ కేంద్రంలో ఎన్డీయేదే విజయమని తేల్చేశాయి. ఇక రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా వచ్చేసింది. టీడీపీ మరోమారు అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని లగడపాటి తేల్చేశారు. టీడీపీ వందకుపైగా స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు.  

ఇదిలావుంచితే, లగడపాటి సర్వే వివరాలను వెల్లడిస్తున్నప్పుడు ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. తెలుగు బిగ్‌బాస్‌ షోలో 'కామన్ మ్యాన్' కోటాలో హౌస్‌లోకి అడుగుపెట్టిన నూతన్ నాయుడు గుర్తున్నాడుగా? నిన్న లగడపాటి సర్వే వివరాలను చెబుతున్నప్పుడు ఆయన పక్కన కూర్చున్నది అతడే. దీంతో ఫోకస్ అంతా ఇప్పుడు ఆయనపై పడింది.

బిగ్‌బాస్ షో తర్వాత మళ్లీ ఇప్పుడే కనిపించిన ఆయన, లగడపాటి పక్కన ఎందుకు కూర్చున్నాడన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. లగడపాటికి, ఆయనకు ఉన్న సంబంధం ఏమిటని ఆరా తీస్తున్నారు. లగడపాటి ‘ఆర్జీ ఫ్లాష్ టీం’తో ఆయనకు ఏదో లింకు ఉండే ఉంటుందని భావిస్తున్నారు. ఆ సర్వే సంస్థను నూతన్ నాయుడే నడిపిస్తుండవచ్చని కూడా అనుకుంటున్నారు. అందుకనే లగడపాటి పక్కన కూర్చున్నాడని చెబుతున్నారు.  

Lagadapati
Nutan naidu
RG falsh team
Andhra Pradesh
Big Boss
  • Loading...

More Telugu News