Andhra Pradesh: ఏపీలో గెలవబోతున్నాం.. కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాం: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్

  • మా గెలుపుపై ఎటువంటి అనుమానం లేదు
  • వైసీపీకి మళ్లీ భంగపాటు తప్పదు
  • ఏపీ ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షించారు

ఏపీలో తమ పార్టీ గెలవబోతోందని, కేంద్రంలోనూ చక్రం తిప్పబోతున్నామని టీడీపీ సీనియర్ నేత బాబూ రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ గెలుపుపై ఎటువంటి అనుమానం లేదని అన్నారు. 2014లో వైసీపీ ఏవిధంగా అయితే భంగపడిందో, అదేవిధంగా మరోమారు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. గత ఎన్నికల ఫలితాలకు ముందు కూడా వైసీపీ ఇదేవిధంగా హంగామా చేశారని అన్నారు. ఏపీ ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షించి ఓటు వేశారు కనుక, చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ నెల 23 తర్వాత వైసీపీ నేతలు, నాయకులకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఎటువంటి పని ఉండదని, సొంత వ్యాపారాలు, లెక్కలూ జమలూ చూసుకుంటే సరిపోతుందని అన్నారు.

Andhra Pradesh
Telugudesam
rajendra prasad
YSRCP
  • Loading...

More Telugu News