Uttarkhand: ‘బద్రీనాథ్’ను సందర్శించిన మోదీ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-11a77190b35954e58f8f8c8972cfe7856d62ee71.jpg)
- ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు
- ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ
- మోదీని చూసేందుకు ప్రజల ఆసక్తి
రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బదరీనాథ్ లో మోదీని చూసేందుకు ప్రజలు, భక్తులు ఆసక్తి కనబరిచారు. నిన్న కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించుకొని అక్కడే హిమాలయాల్లోని పవిత్ర గుహల్లో దాదాపు ఇరవై గంటలపాటు ధ్యానంలో పాల్గొన్నారు.