Telangana: మైనర్ బాలికను వేధించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • తెలంగాణలోని ఆర్మూర్ లో ఘటన
  • పెళ్లి చేసుకోవాలని వేధింపులు
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు

కట్టుకున్న భార్య ఉండగానే ఓ వ్యక్తి అడ్డదారులు తొక్కాడు. పెళ్లి చేసుకుంటాననీ, తనను ప్రేమించాలని ఓ మైనర్ బాలిక వెంటపడటం మొదలుపెట్టాడు. అయితే ఇందుకు యువతి నిరాకరించడంతో వేధింపులు తీవ్రతరం చేశాడు. చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అరెస్ట్ అయి ఊచలు లెక్కపెడుతున్నాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని ఆర్మూర్ కార్పొరేటర్ లత భర్త శ్రీనివాస్ గత కొంతకాలంగా ఇదే ప్రాంతానికి చెందిన యువతిని వేధిస్తున్నాడు. టీఆర్ఎస్ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడైన శ్రీనివాస్ పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక వెంటపడటం మొదలుపెట్టాడు. యువతి తల్లిదండ్రులు మందలించినా ఆయన ప్రవర్తన మార్చుకోలేదు. చివరికి ఈ వేధింపులు హద్దు దాటడంతో తల్లిదండ్రుల సాయంతో బాలిక ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాస్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేశారు.

Telangana
TRS
jeevan reddy
harassment
Police
Nizamabad District
armur
minor girl
  • Loading...

More Telugu News