Andhra Pradesh: చంద్రగిరిలోని ఏడు కేంద్రాల్లో ఎంత పోలింగ్ నమోదయిందంటే!

  • సగటున 33 శాతం పోలింగ్ నమోదు
  • వెంకట్రామపురంలో అత్యధికంగా 52 శాతం పోలింగ్
  • భారీగా పోలింగ్ నమోదుకావచ్చంటున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరిలో ఈరోజు ఏడు గ్రామాల్లో రీపోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దళితులను ఓటేయనివ్వలేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈసీ ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలూరు, కుప్పం బాదూరులో ఈరోజు రీ-పోలింగ్ నిర్వహిస్తోంది.

పులివర్తిపల్లిలో ఈరోజు మధ్యాహ్నం నాటికి 33 శాతం పోలింగ్ నమోదు కాగా,  వెంకట్రామపురంలో 52 శాతం, కొత్త కండ్రిగలో 26 శాతం, కమ్మపల్లెలో 23 శాతం, ఎన్ఆర్ కమ్మపల్లెలో 34 శాతం, కుప్పంబాదూరులో 35 శాతం పోలింగ్ నమోదయింది. అలాగే కాలూరులో 36 శాతం పోలింగ్ పూర్తయింది. రీపోలింగ్ మొత్తం సగటు ఓటింగ్ 33 శాతంగా నిలిచింది. ఈ నేపథ్యంలో సాయంత్రానికల్లా 65 శాతానికి మించి పోలింగ్ నమోదయ్యే అవకాశముందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

Andhra Pradesh
Chittoor District
chandragiri
re polling
7 booths
  • Loading...

More Telugu News