Crime News: కొడుకు వేధింపులు భరించలేక కడుపు తీపిని చంపుకున్న తండ్రి : ఆవేశంలో హత్య

  • మరో కొడుకుతో కలిసి రోకలి బండతో మోదడంతో దుర్మరణం
  • మృతుడు ఆటోడ్రైవర్‌
  • కడప జిల్లా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కుటుంబం

కొడుకు నిత్యం పెట్టే వేధింపులు అతనిలోని కడుపు తీపిని చంపేశాయి. కన్నతండ్రిపైనే చెయ్యి చేసుకున్న అతని తీరును భరించలేక మరో కొడుకుతో కలిసి రోకలి బండతో మోది హత్య చేశాడు. హైదాబాద్‌లోని చింతల్ భగత్‌సింగ్‌ నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కడప జిల్లా గంగాయపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు. పదేళ్ల క్రితం ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్‌లోని చింతభగత్‌సింగ్‌ నగర్‌కు కుటుంబంతో వలస వచ్చారు. కొన్నాళ్ల తరువాత పెద్దకొడుకు వెంకటరమణ తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. రెండో కొడుకు శ్రీనివాస్‌ తల్లిదండ్రులకు సమీపంలోని దుర్గయ్యనగర్‌లో ఉంటుండగా, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చిన్న కొడుకు వెంకటేశ్వర్లు (30) మాత్రం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. వెంకటేశ్వర్లు తరచూ మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తుండేవాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కూడా పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపు వేసి ఉండడంతో గట్టిగా కొట్టాడు.  తల్లి పెద్ద కొడుకు వద్దకు వెళ్లడంతో తండ్రి వెళ్లి తలుపు తీశాడు. ‘ఇంత ఆలస్యంగా తీయడమా’ అని అగ్రహం చెందిన వెంకటేశ్వర్లు  తండ్రిపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన పుల్లయ్య విషయాన్ని సమీపంలో ఉంటున్న రెండో కొడుకు శ్రీనివాస్‌కు చెప్పగా అతను ఆగ్రహంతో కర్రచేత పట్టుకుని వచ్చి సోదరుడిని చితకబాదాడు.

అదే సమయంలో తండ్రి పుల్లయ్య రోకలి బండతో వెంకటేశ్వర్లు తలపై మోదడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనానంతరం నిందితులు ఇద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.

Crime News
Hyderabad
cuadapha
son murdered
  • Loading...

More Telugu News