Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 120-130 సీట్లు సాధిస్తాం!: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మేస్థితిలో లేరు
  • బెట్టింగుల కోసమే ఆయన సర్వేలు ఇస్తున్నారు
  • చంద్రగిరిలో మీడియాతో వైసీపీ సీనియర్ నేత

లోక్ సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బెట్టింగుల కోసమే లగడపాటి సర్వేలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పిన లగడపాటి, ఇప్పుడు టీఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం వెంకట్రామపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఈసారి వైసీపీకి 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. అలాగే చిత్తూరు జిల్లాలో మూడు లోక్ సభ సీట్లతో పాటు మెజారిటీ అసెంబ్లీ సీట్లను దక్కించుకుంటామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాన్ని, జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

Andhra Pradesh
assembly
120-130 seats
peddi reddy ramachandrareddy
YSRCP
lagadapati
  • Loading...

More Telugu News