Narendra Modi: ఓటువేసి యువతరం సత్తాచాటాలి : ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ట్వీట్లు

  • చివరి దశలో భారీగా ఓటింగ్‌ నమోదు కావాలని పిలుపు
  • మీ ఓటు భవిష్యత్తు భారతీయుని తలరాత మార్చేది కావాలి
  • మంచి నాయకుడే అభివృద్ధి, సంక్షేమానికి భరోసా ఇస్తాడు

యువత భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని తమ సత్తా చాటాలని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షాలు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న చివరి విడత పోలింగ్‌ సందర్భంగా వారు వేర్వేరుగా ట్వీట్లు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో యువత ముందుకు రావాలని, రికార్డు స్థాయి ఓటింగ్‌ నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

తొలిసారి ఓటేసే వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారని అనుకుంటున్నానని, మీ ఓటు భావితరాల తలరాతను మార్చేందుకు నాంది పలకాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మంచి నాయకుడు మాత్రమే భరోసా ఇవ్వగలడని, నవభారత్‌ను కోరుకుంటున్న వారు అభివృద్ధికి ఓటేస్తారని నమ్ముతున్నామని అన్నారు. మీ ఓటుతో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

Narendra Modi
Amit Shah
Twitter
youth voting
  • Loading...

More Telugu News