Chittoor District: చంద్రగిరి నియోజకవర్గంలో మరికాసేపట్లో రీపోలింగ్ ప్రారంభం

  • చెవిరెడ్డి ఫిర్యాదుతో ఐదు.. నాని ఫిర్యాదుతో రెండు పోలింగ్  కేంద్రాల్లో రీపోలింగ్
  • ఉద్రిక్తతల నేపథ్యంలో గట్టి బందోబస్తు
  • మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లె(321), కమ్మపల్లె(318), పులివర్తివారిపల్లె(104), కొత్తకండ్రిగ(316), వెంకట్రామాపురం(313) పోలింగ్ బూత్‌లలో మరికాసేపట్లో రీపోలింగ్ ప్రారంభం కానుంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తోంది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదుతో మరో రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని శనివారం ఎన్నికల సంఘం నిర్వహించింది. దీంతో రీపోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాల సంఖ్య ఏడుకు పెరిగింది.

ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించనున్న విషయాన్ని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్‌ఆర్ కమ్మపల్లెలో ఇటీవల టీడీపీ-వైసీపీల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రీపోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Chittoor District
Chandragiri
Re-polling
chevireddy
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News