Himachal Pradesh: మరోసారి ఓటేయడానికి సిద్ధమైన భారతదేశపు తొలి ఓటరు!

  • 102 ఏళ్ల శ్యామ్ సరన్ నేగికి అపురూప గౌరవం
  • 1951 ఎన్నికల్లో తొలిఓటు ఈ వ్యక్తిదే
  • పోలింగ్ కేంద్రానికి సగౌరవంగా తీసుకొస్తామన్న జిల్లా కలెక్టర్

హిమాచల్ ప్రదేశ్ లోని కల్పా ప్రాంతానికి చెందిన శ్యామ్ సరన్ నేగి ఓ శతాధిక వృద్ధుడు. ఆయన వయసు 102 సంవత్సరాలు. అయితే, అసలు విశేషం అదికాదు. 1951లో భారత్ లో ప్రథమంగా ఎన్నికలు జరగ్గా, ఆ ఎన్నికల్లో ఓటు వేసిన తొలి భారతీయుడు శ్యామ్ సరన్ నేగీనే. సరిగ్గా చెప్పాలంటే ఆయన భారతదేశపు తొలి ఓటరు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన నేగీ ఇప్పుడు మరోసారి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

కిన్నౌర్ జిల్లాకు చెందిన ఆయన ప్రతి ఎన్నికల్లోనూ తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈసారి ఆయన వయసు రీత్యా పోలింగ్ కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సగౌరవంగా తీసుకువచ్చే బాధ్యత తమదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. దేశంలో చివరివిడత పోలింగ్ రేపు జరగనుండగా, శ్యామ్ సరన్ నేగీ ఎవరికి ఓటేసినా అది అపురూపమైన విషయం కానుంది.

  • Loading...

More Telugu News