jagan: మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే జగన్, విజయసాయిరెడ్డిలను జైలుకు పంపిస్తాం: రాజేంద్రప్రసాద్

  • 20 ఎంపీ, 120 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ గెలుచుకుంటుంది
  • 23వ తేదీన జగన్ కు ఆశాభంగం తప్పదు
  • జగన్ ను హైదరాబాద్ నుంచి కేసీఆర్ తరిమేశారు

23వ తేదీన వైసీపీ అధినేత జగన్ కు ఆశాభంగం తప్పదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. 20 ఎంపీ, 120 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలవబోతోందని చెప్పారు. చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారని అన్నారు. ఈ విషయం తెలిసే జగన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి అమరావతికి తరిమేశారని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్, విజయసాయి రెడ్డిలను చంచల్ గూడ జైలుకు పంపుతామని అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు కేవీపీ రామచంద్రరావు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని.. విజయసాయిరెడ్డి విషపు సాయిరెడ్డిలా మాట్లాడుతున్నారని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఎన్నికల వ్యవహారంలో చీఫ్ సెక్రటరీ జోక్యం ఏమిటని ప్రశ్నించారు.

jagan
vijayasai reddy
chandrababu
kcr
rajendra prasad
  • Loading...

More Telugu News