Odisha: ‘దంతెవాడ’ దాడులకు ప్రతీకారం.. పంచాయతీ ఆఫీసును పేల్చివేసిన మావోయిస్టులు!

  • ఒడిశాలోని మల్కన్ గిరిలో ఘటన
  • తిమురుపల్లి పంచాయతీ ఆఫీసు పేల్చివేత
  • కూంబింగ్ ముమ్మరం చేసిన భద్రతాబలగాలు

ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో ఈరోజు మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని తిమురుపల్లి పంచాయతీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కేంద్ర సాయుధ బలగాల దమనకాండకు నిరసనగానే ఈ భవనాన్ని పేల్చివేసినట్లు మావోయిస్టులు ప్రకటించారు.

ఈ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) పేరుతో కరపత్రాలను అంటించారు. పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేసిన అనంతరం మావోయిస్టులు అటవీప్రాంతంలోకి పారిపోయారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి కూంబింగ్ ను ముమ్మరం చేశారు.

Odisha
dantewada
maoists
blown
panchayat office
  • Loading...

More Telugu News