komati reddy: నేను ఎంపీనవుతా.. ఆయన బతుకు బజారుపాలవుతుంది: కోమటిరెడ్డి

  • గుత్తా సుఖేందర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు
  • పిచ్చి వాగుడు వెంటనే ఆపేయాలి
  • 23 తర్వాత గుత్తా మాజీ ఎంపీ అయిపోతారు

ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్ది వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. గుత్తా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని... పిచ్చి వాగుడు వెంటనే ఆపేయాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా తాను సంతోషంగా గ్రామాల్లో తిరుగుతున్నానని చెప్పారు. పిల్లికి కూడా భిక్షం పెట్టే అలవాటు లేని వ్యక్తి గుత్తా అని... ఇంట్లో పనిమనిషికి జ్వరం వచ్చి, వైద్యం కోసం రూ. 10 వేల అడిగినా ఇవ్వలేనటువంటి నీచ మనస్తత్వమని అన్నారు. తాను ఎంపీగా గెలవబోతున్నానని... 23 తర్వాత గుత్తా మాజీ ఎంపీగా మారిపోతారని చెప్పారు. ఆ తర్వాత ఆయన బతుకు బజారుపాలవుతుందని చెప్పారు. కోమటిరెడ్డి లక్ష్మి ఎమ్మెల్సీ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

komati reddy
venkata reddy
gutha sukhender reddy
TRS
congress
  • Loading...

More Telugu News