allu sirish: 'ఏబీసీడీ' తొలిరోజు వసూళ్లు

  • నిన్న థియేటర్లకు వచ్చిన 'ఏబీసీడీ'
  • కథానాయికగా రుక్షార్ థిల్లోన్ 
  • ముఖ్యమైన పాత్రలో భరత్

అల్లు శిరీశ్ కథానాయకుడిగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' రూపొందింది. యశ్ రంగినేని - మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రుక్షార్ థిల్లోన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, భరత్ ముఖ్యమైన పాత్రలో కనిపించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజున 2.25 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

వేసవి సెలవులు కావడం వలన వసూళ్లు పుంజుకునే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మలయాళంలో 2013లో వచ్చిన 'ఏబీసీడీ'కి ఇది రీమేక్. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా దుల్కర్ కెరియర్ కి ఎంతో హెల్ప్ అయింది కూడా. అలాగే ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని అల్లు శిరీశ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకం నిజమవుతుందేమో చూడాలి మరి. 

allu sirish
rukshar
bharath
  • Loading...

More Telugu News