nagarjuna: మన్మథుడిని ఆలోచనలో పడేసిన 'గ్యాంగ్ లీడర్'

  • షూటింగు దశలో 'మన్మథుడు 2'
  • ప్రత్యేక పాత్రలో సమంత 
  • ఆగస్టు 30న 'గ్యాంగ్ లీడర్'

నాగార్జున - రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో 'మన్మథుడు 2' రూపొందుతోంది. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా పోర్చుగల్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను ఆగస్టు చివరిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో నాగార్జున వున్నారు.

అయితే నాని కథానాయకుడిగా నటిస్తోన్న 'గ్యాంగ్ లీడర్' ఆగస్టు 30వ తేదీన విడుదల కానుంది. నిన్ననే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు. దాదాపుగా ఆ తేదీకి కాస్త అటు ఇటుగా వద్దామనుకున్న నాగార్జున ఆలోచనలో పడ్డారట. ఈ మధ్య కాలంలో నాగార్జునకి సక్సెస్ లేదు. అందువలన సోలో రిలీజ్ ఆయనకి చాలా అవసరం. ఆ విషయాన్ని గ్రహించే, నాని సినిమాకి .. తన సినిమాకి వారం రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News