Andhra Pradesh: ఇలాంటివారిని ఏపీ సీఎం చంద్రబాబు సమర్థిస్తున్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ అని తప్పుదారి పట్టిస్తున్నారు!: కన్నా లక్ష్మీనారాయణ

  • మోదీకి వ్యతిరేకంగా అరాచకశక్తులు ఏకం
  • బెంగాల్ లో తీవ్రమైన హింసను రాజేస్తున్నాయి
  • గుంటూరులో బహిరంగ సభలో మాట్లాడిన బీజేపీ నేత

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న దొంగలు, అరాచకశక్తులు ఏకం అవుతున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. భారత్ కు అవినీతి చేసేవాళ్లు కావాలా? అరాచక శక్తులు కావాలా? లేక అభివృద్ధి కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ అరాచక శక్తులు పశ్చిమబెంగాల్ కేంద్రంగా హింసను రాజేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీ చీఫ్ అమిత్ షాపై జరిగిన దాడికి నిరసనగా గుంటూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో కన్నా మాట్లాడారు.

బెంగాల్ లో అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు కన్నా తెలిపారు. పశ్చిమబెంగాల్ లో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అనే రీతిలో పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులకు కారకులైనవారిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రజాస్వామ్య పరిరక్షణ అని పేరు పెట్టి ప్రజలందరినీ తప్పుదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు, ఉగ్రవాదులు అందరూ ఏకమై అమిత్ షాపై దాడిచేశారన్నారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
kanna
BJP
Amit Shah
attack
West Bengal
  • Loading...

More Telugu News