kumaraswamy: తనయుడు కుమారస్వామితో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ప్రధాని దేవెగౌడ

  • ప్రధాని పదవి ఎవరిని వరిస్తుందో తెలియదన్న దేవెగౌడ
  • సకాలంలో వర్షాలు కురవాలని స్వామిని కోరుకున్న మాజీ ప్రధాని
  • కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 18 సీట్లు వస్తాయన్న కుమారస్వామి

తమ పయనం కాంగ్రెస్‌తోనేనని కర్ణాటక జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మరోమారు స్పష్టం చేశారు. తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి అయిన కుమారస్వామితో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈసారి ప్రధాని పదవి ఎవరిని వరిస్తుందో తెలియదన్నారు. అయితే, తాము మాత్రం కాంగ్రెస్‌తోనే ఉంటామని తేల్చి చెప్పారు. వర్షాలు సకాలంలో కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్యలు తీరేలా చూడాలని స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..  ఈ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 18 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

kumaraswamy
Karnataka
hd deve gowda
Tirumala
Tirupati
Congress
  • Loading...

More Telugu News