Dharma Reddy: రీపోలింగ్ వెనుక కేంద్ర హోంశాఖ అధికారి ధర్మారెడ్డి కీలక పాత్ర పోషించారు: టీడీపీ ఆరోపణలు

  • రాజశేఖర్‌రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి
  • ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చారు
  • ధర్మారెడ్డి ఒత్తిడి మేరకే రీపోలింగ్

చంద్రగిరిలో రీపోలింగ్ జరగడం వెనుక కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ధర్మారెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ ఆరోపిస్తోంది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు కీలక నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేతలు ధర్మారెడ్డిపై సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఒత్తిడి మేరకే రీపోలింగ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ధర్మారెడ్డి ఈసీ కార్యాలయానికి వచ్చినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, ఆయన ఈసీకి లంచం ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డికి ధర్మారెడ్డి చాలా దగ్గరని టీడీపీ ఆరోపిస్తోంది. ధర్మారెడ్డి ఎన్నికల సంఘాన్ని ఎన్నిసార్లు కలిశారు... ఏఏ అధికారులతో ఆయన ఎన్నిసార్లు మాట్లాడారు... ఎవరెవరికి ఎంత లంచాలు ఇచ్చారనే ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

Dharma Reddy
Rajasekhar Reddy
Chandrababu
CEC
Telugudesam
Chandragiri
  • Loading...

More Telugu News