KCR: రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్ సమీక్ష
- కవాతు లేకుండానే వేడుకలు
- ఎండ తీవ్రత దృష్ట్యా కీలక నిర్ణయం
- పరేడ్ గ్రౌండ్స్ కు బదులు పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా జరపాలన్న విషయమై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మార్చ్ పాస్ట్ లేకుండానే వేడుకలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, పరేడ్ గ్రౌండ్స్ కు బదులుగా పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు జరపాలని నిశ్చయించారు.
జూన్ 2న ఉదయం 9 గంటల నుంచి 10.30 వరకు గంటన్నర పాటు పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు నిర్వహించాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఉదయం 9 గంటలకు పతాక ఆవిష్కరణ, ఆపై కేసీఆర్ ప్రసంగం వుంటాయి. 10.30 గంటలకు సీఎస్ ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహాల్ లో కవిసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు.